Revanth Reddy: ట్విట్టర్ లో ఆ విడియో డిలేట్ చేసిన సుప్రీత బండారు

నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, గ్లామర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు… ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసకుంది. అందం, అభినయం రెండు కలబోసిన నటిగా ఆమెకు టాలీవుడ్‌ లో ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఇక స్విల్వర్ స్క్రీన్‌ పై ఎంత ఉత్సాహంగా, హుషారుగా ఉంటుందో.. సోషల్ మీడియాలోనూ అంతే జోష్ గా ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటుంది.

గతంలో సురేఖ వాణీ, కూతురు సుప్రీత డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోని వైరల్ గా మారారు. తాజాగా సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ గా మారుతున్నారు. అదేమిటంటే ఎన్నికలకు ముందు కొంత మంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వీడియోలు పోస్ట్ చేశారు. బిఆర్ఎస్ క్యాంపెయింగ్‌లో బుల్లితెర సెల‌బ్రిటీలు చాలామందే పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియ ఇలా చాలా మంది కారు గుర్తుకు ఓట్ వేయాలని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ ప్రచారం చేసిన ఇన్‌ఫ్లూయెన్సెర్లలో సుప్రీతా నాయుడు బండారు ఒకరు. అయితే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందిన తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో విజయం సాధించిన విషయం తెలిసిందే.. అందులో న‌టి సురేఖ‌వాణి, కూతురు సుప్రీత కూడా ఉన్నారు. సుప్రిత కూడా ఈ బీఆర్ఎస్ క్యాంపైన్‌లో భాగంగా వీడియో పోస్ట్ చేయ‌డం జ‌రిగింది.

అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓట‌మితో వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది సుప్రీత‌. అనంత‌రం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను సుప్రిత పోస్ట్ చేసింది. దీంతో ఈమెపై నెటిజ‌న్లు వీప‌రితంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సుప్రీత‌పై దారుణ‌మైన కామెంట్లు చేస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus