Suriya Kiran, Kalyani: ఇన్నాళ్టికి అసలు విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్ కళ్యాణి భర్త సూర్య కిరణ్..!

  • July 18, 2022 / 05:50 PM IST

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 200కి పైగా సినిమాల్లో నటించిన సూర్య కిరణ్… 2004 లో వచ్చిన ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఇతనికి వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ అటు తర్వాత చేసిన ‘ధన 51’ ‘బ్రహ్మాస్త్రం’ ‘రాజు భాయ్’ ‘చాప్టర్ 6’ వంటి చిత్రాలు ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఇతనికి అవకాశాలు రాలేదు. 2020 వ సంవత్సరంలో బిగ్ బాస్ 4వ సీజన్ ద్వారా మళ్ళీ జనాల ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉండగా.. గతంలో ఇతను హీరోయిన్ కళ్యాణి ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల పాటు కలిసున్న వీరు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. దీనికి కారణాలు ఏంటి అన్న విషయం పై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. బిగ్ బాస్ 4 టైంలో కూడా సూర్య కిరణ్.. ఈ విషయం పై ఎక్కువగా స్పందించలేదు. అయితే ఇటీవల అతను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కళ్యాణితో విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటనేది చెప్పుకొచ్చాడు.

“‘మేము 10 ఏళ్ళు కలిసున్నాం. విడాకులు తీసుకోవడానికి కారణాలు అంటూ ఏమీ లేవు. మేము విడాకుల కోసం కోర్టు కి వెళ్ళినప్పుడు.. జడ్జిగారు మమ్మల్ని కారణాలు అడిగారు. నాకైతే ఏమీ లేవు. ‘మీరే చెప్పండి’ అని నేను కళ్యాణి గారితో అన్నాను. అప్పుడు ఆమెను జడ్జి గారు ప్రశ్నలు అడిగారు. ‘ఏవమ్మా.. అతను నిన్ను కొడతాడా, నిన్ను తిడతాడా, అతని ఫ్యామిలీ నిన్ను ఇబ్బంది పెడుతుందా?’ అంటూ అడిగారు..! వాటికి ఆమె ‘ఉహూ’ అనే సమాధానం ఇచ్చింది.

మీరు విడిపోతే మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? అని జడ్జి గారు అడిగారు. అప్పుడు నేను ‘మాకు పిల్లలు లేరు సర్’ అని చెప్పాను. అప్పుడు జడ్జి గారు ‘ఓహో పిల్లలు లేరని విడిపోవాలి అనుకుంటున్నారా?’ అని అన్నారు. ఆయనే డిసైడ్ చేసేసారు. మంచి రీజన్ దొరికింది అని మేము కూడా సైలెంట్ గా ఉన్నాం. తర్వాత బయటకు వచ్చాక కళ్యాణి గారితో అన్నాను. ‘మీరు వెయిట్ చేయండి, డబ్బులు వచ్చాక అప్పులు అన్నీ తీర్చేద్దాం..

మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని’ చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు. సో వీరి విడాకులకు రీజన్ ఆర్థిక ఇబ్బందులు అని స్పష్టమవుతుంది. అలాగే కళ్యాణి గారు అంటే సూర్య కిరణ్ కి ఇప్పటికీ ప్రేమ ఉంది అని.. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus