ప్రభాస్ కోసం తన సినిమా పోస్ట్ పోన్ చేసుకున్న సూర్య
- April 25, 2019 / 06:36 PM ISTByFilmy Focus
“బాహుబలి” తర్వాత ప్రభాస్ స్థాయి ఏరేంజ్ లో పెరిగిందంటే.. మనోడి సినిమా విడుదలవుతుందంటే బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ చిత్రాలను పోస్ట్ పోన్ చేసుకొనేంత స్థాయికి ఎదిగాడు ప్రభాస్. అలాంటప్పుడు ప్రభాస్ సినిమాకి తమిళ నటుడు సూర్య మాత్రం అడ్డుగా నిలవగలడా చెప్పండి. అందుకే.. సూర్య తన తాజా చిత్రం “కప్పన్”ను ఆగస్ట్ బరి నుంచి తప్పించాడు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, ఆర్య కీలకపాత్రలు పోషిస్తుండగా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15, 2019న విడుదల చేయాలనుకున్నారు.
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
కానీ.. ఆ డేట్ ను సాహో ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని ఉండడంతో సూర్య మరీ ప్రభాస్ కు భయపడి సినిమాను పోస్ట్ చేసినట్లు ఉండడం కాక సినిమా షూటింగ్ పెండింగ్ ఉండని కవర్ చేస్తున్నారు. సూర్యకి ప్రభాస్ మంచి స్నేహితుడన్న విషయం తెలిసిందే. అయితే.. ఎంత స్నేహితుడైనా సినిమాల విడుదల సమయంలో పోటీ కామన్ కదా.

















