సూర్యలోని నటుణ్ని మరోసారి తెరపై ఆవిష్కరించిన చిత్రం ‘జైభీమ్’. బడుగుల తరఫున పోరాడే న్యాయవాదిగా సూర్య ఆ సినిమాలో అద్భుతంగా నటించారు. అయితే ఆ సినిమా విడుదలైనప్పటి నుండి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. అందులో తమిళనాడు ఉత్తర భాగానికి చెందిన ‘వన్నియార్లు’ అనే కమ్యూనిటీకి అవమానం జరిగింది అంటూ ఓ చర్చ రేగింది. పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్ ఆరోపించారు. ఇటీవల సూర్య దీనిపై స్పందించారు. నా చుట్టుపక్కల ఉన్నవారి జీవితాలను మెరుగుపరచడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.
దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి నాకు మద్దతు ఉంది అని చెప్పుకొచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం ఎవరినీ దూషించి పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశం లేదనన్నాడు. ఆ అవసరం కూడా తనకు లేదని చెప్పాడు సూర్య. మా చిత్ర బృందాని అలాంటి ఆలోచన లేదు. సినిమాకు సంబంధించి కొన్ని అంశాలను మా దృష్టికి తీసుకొస్తే… వెంటనే సినిమాలో మార్పులు చేశాం అని సూర్య చెప్పించారు. దీంతోపాటు సినిమాలో చూపించిన చాలా అంశాలపై తనదైన విశ్లేషణ చేశాడు సూర్య.
ఈ సినిమా డాక్యుమెంటరీ కాదు. వాస్తవ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన కథ. అంతేకాదు ఈ సినిమా కల్పితమని సినిమా మొదట్లో చెప్పాం కూడా. సన్నివేశాలు, పేర్లు ప్రత్యేకంగా ఏ ఒకరిని లేదా సంఘటనను ఉద్దేశించి రూపొందించనవి కావు. కొన్ని విషయాల్లో కులం, మతం, భాష, జాతి లాంటి పట్టింపులు ప్రపంచమంతటా ఉన్నాయడానికి ఆధారాలున్నాయని చెప్పాడు సూర్య.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!