Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..
- August 4, 2026 / 12:35 PM ISTByFilmy Focus Desk
‘కరుప్పు’ సినిమా రిలీజ్ రోజున చెన్నైలోని ఓ థియేటర్‌లో సినిమా అయిపోయాక దర్శకుడు ఆర్జే బాలాజీ.. ఎంతో ఉద్వేగంతో విజయనాధాలు చేశాడు. సినిమా ఫలితం, ప్రేక్షకుల రియాక్షన్ చూశాక తనకు తెలియకుండానే గట్టిగా అరిచేశాడు. అప్పటివరకు తనలో ఉన్న ఆ బాధను బయటకు పంపించేశాడు. ఆ వెంటనే ఆనంబాష్పాలతో తన టీమ్‌ను హత్తుకున్నాడు. దానికి కారణం సినిమా విజయం ఒకటి కాగా, రెండోది ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా విడుదలకు ఆఖరు నిమిషంలో ఇబ్బందులు రావడమే.
Suirya
ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు రావడంతో ‘కరుప్పు’ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూర్య, జ్యోతిక మాట్లాడారు. ‘కరుప్పు’ సినిమా సమయంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను, ఆ క్లిష్ట సమయంలో తన భార్య జ్యోతిక అందించిన మద్దతును సూర్య గుర్తు చేసుకున్నాడు. ‘కరుప్పు’ సినిమా విడుదలకు ముందు చివరి నిమిషంలో ఆర్థిక పరమైన, పంపిణీ సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమయంలో సినిమాను థియేటర్లలో ప్రదర్శించడం కోసం అదనపు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది అని సూర్య చెప్పాడు.

ఆ సమయంలో ఆ నిర్ణయం మా కుటుంబానికి పెద్ద రిస్క్. కానీ, జ్యోతిక నాపై ఉంచిన నమ్మకమే నేను ధైర్యంగా ముందడుగు వేసేలా చేసింది. ఆ విషయంలో ఆమె నాకు కొండంత అండగా నిలిచింది అని సూర్య చెప్పాడు. ఇక ఇదే విషయంలో జ్యోతిక మాట్లాడుతూ.. ఆ సినిమా విషయంలో గొప్పతనమంతా సూర్యకే చెందుతుంది అని భర్తకే క్రెడిట్ ఇచ్చేసింది. నేనీ ప్రశంసను స్వీకరించను. మేము ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుంటాం. పిల్లల పెంపకం విషయంలోనూ ఒకే అభిప్రాయంతో ఉంటాం. ముందు చర్చించుకుని తర్వాత పిల్లలకు వివరిస్తాం అని చెప్పింది.
సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ‘కరుప్పు’ / ‘వీరభద్రుడు’ సినిమాను తొలుత మే 14న విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల సినిమా విడుదల ఒక రోజు ఆలస్యమైంది. ఇదన్నమాట సంగతి.














