Suriya, Rajinikanth: మరో ‘రోలెక్స్‌’ రెడీ అవుతున్నాడా.. సూర్య సో సూపర్‌ కదా!

Advertisement

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాలో హైలైట్‌ అయిన అంశాల్లో రోలెక్స్‌ పాత్ర ఒకటి. సూర్య పోషించిన ఆ పాత్రను మరచిపోవడం అంత ఈజీగా కాదు. ఆ పాత్ర తెరపై వచ్చినప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండటమూ అంత ఈజీ కాదు. అంతలా అదరగొట్టేశాడు సూర్య ఆ పాత్రలో. ఇప్పుడు ఇంచుమించుగా అలాంటిదే మరో పాత్ర సిద్ధమవుతోంది అని సమాచారం. అయితే ఈసారి సూర్య కనిపించబోయే చిత్రం కమల్‌ది కాదు, రజనీకాంత్‌ది. అవును రజనీ కొత్త సినిమాలో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

సూర్య (Suriya) ఇటీవల క్యామియో రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. ‘విక్రమ్‌’ తర్వాత ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్‌లో కూడా చిన్న పాత్ర చేశాడు. ఇప్పుడు అలా రజనీకాంత్‌ సినిమాలో నటిస్తాడట. అయితే అది కూడా అతనికి బాగా పరిచయం ఉన్న దర్శకుడితోనే. ఈ మేరకు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ‘జై భీమ్’ లాంటి అదిరిపోయే సినిమాను ఇచ్చిన జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన 170వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనే సూర్య నటిస్తాడని అంటున్నారు.

రజనీకాంత్‌ సినిమాలో కీలక పాత్ర కోసం సూర్యను సంప్రదిస్తే ఆయన వెంటనే ఓకే చేశారు అని కోడంబాక్కం టాక్‌. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పలేం అంటున్నారు. అయితే సూర్య ప్రజెంట్‌ మూడ్‌లో ఇలాంటి పాత్రలు ఓకే చేయడం పెద్ద విషయమేమీ కాదు అంటున్నారు. సరైన పాత్ర వస్తే అతిథి పాత్ర అయినా, నిడివి తక్కువ ఉన్న పాత్ర అయినా చేసేస్తున్నాడట.

ఇక సూర్య హీరోగా నటిస్తున్న 42వ సినిమాకు ఇటీవల ‘కంగువ’ అని పేరు పెట్టారు. ఇందులో కథానాయికగా దిశా పటానీ నటిస్తోంది. శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా లుక్‌కి మంచి స్పందన వచ్చింది. 1670ల కాలం నాటి ఓ పోరాట యోధుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందట. త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus