ఆస్కార్ పోటీ నుంచి తప్పుకున్న సూర్య సినిమా..!

Advertisement

గడిచిన కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడొదొడుకులు ఎదుర్కొంటున్న సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా గతేడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నటుడిగా సూర్యకు మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. తమిళంలో సురారు పోట్రై పేరుతో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా సూర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి కావడం గమనార్హం.

డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు కూడా ఎంపిక కాగా ఆస్కార్ నామినేషన్ కు ఎంపికవడంతో సూర్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సినిమా ఆస్కార్ రేసు నుంచి తప్పుకుంది. సురారై పోట్రు అకాడమీ స్క్రీనింగ్ తర్వాత రౌండ్స్ కు ఎంపిక కాకపోవడం వల్ల ఆస్కార్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సినిమా తర్వాత రౌండ్స్ కు ఎంపికై ఉంటే బాగుండేదని సూర్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. జిఆర్ గోపీనాథ్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సూర్యకు జోడీ అపర్ణబాలమురళి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా సిఖ్యా ఎంటర్టైన్మెంట్, 2 డి ఎంటర్టైన్మెంట్, సూర్య సొంత ప్రొడక్షన్ బ్యానర్ లపై తెరకెక్కింది. ఆస్కార్ కు నామినేట్ కావడంతో ఆనందంలో తేలిపోయిన చిత్రయూనిట్ కు చివరకు నిరాశ మిగలడం గమనార్హం. విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఊహించని స్థాయిలో ప్రజాదరణ పొందింది. కంటెంట్ లేని సినిమాలే ఓటీటీలో విడుదలవుతున్నాయనే విమర్శలకు ఈ సినిమా చెక్ పెట్టింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ సుధాకొంగర దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus