చందమామపై ధోని.. స్పేస్ ప్రయాణంలో ధోని

క్రికెట్ టూర్లతోనే ధోనికి టైం సరిపోతుంది. ఇంకా అంతరిక్షయానం కూడానా.. అనిపిస్తుంది కదూ. అయితే ఇది రియల్ ధోని గురించి కాదు రీల్ ధోని కథ. క్రికెటర్ ధోని కథతో తెరకెక్కిన ‘ఎమ్.ఎస్ ధోని – ది టోల్డ్ స్టోరీ’తో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. తర్వాతి సినిమాలపై స్పందిస్తూ ప్రస్తుతం అయిదు సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయని చెప్పిన సుశాంత్ వాటిలో స్పేస్ నేపథ్యంలో సాగే ఒక విభిన్నమైన సినిమా కూడా ఉందని చెప్పుకొచ్చాడు.

‘చందమామ దూర్ కే’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా బాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినిమాలోనే ఇప్పటివరకు రాని కథాంశంతో వుంటుందని తెలిపాడు. దీంతోపాటు ‘రాబ్తా’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని చెప్పుకొచ్చిన సుశాంత్ మరో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నట్టు తెలిపాడు. ‘రాబ్తా’ సినిమాలో కృతి సనన్ తో జత కట్టిన సుశాంత్ తర్వాతి సినిమాల్లో శ్రీలంక సుందరి జాక్విలిన్, పరిణితీ లతో కలిసి నటించనున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇతగాడి నిరీక్షణ అంతా ‘ధోని’ ఫలితం కోసమే. ట్రైలర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి

Dhoni visits set of his Biopic || M.S. Dhoni: The Untold Story || Filmy Focus

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus