మాజీ విశ్వసుందరి స్టార్ హీరోయిన్ కు హార్ట్ ఎటాక్.. షాక్ లో ఫ్యాన్స్ !

గుండెపోటు అనేది ఏ వయసు వారికి ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి వచ్చేది. కానీ ఇప్పుడు నిండా 20 ఏళ్ళు కూడా లేని వారికి కూడా వస్తుంది. ఈ మధ్యనే డాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించిన సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది. జనవరి నెల చివర్లో నటుడు తారకరత్నకి కూడా గుండెపోటు రావడం.. 23 రోజులు కోమాలో ఉంది అతను మరణించడం జరిగింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కు కూడా గుండెపోటు రావడం చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళితే… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ కు గుండెపోటు వచ్చింది. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఆమె వెల్లడిస్తేనే అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె ఈ విషయంపై స్పందిస్తూ… ‘రెండు రోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది.దీంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అలాగే గుండె లోపల స్టెంట్ కూడా అమర్చడం జరిగింది. నాకు ట్రీట్మెంట్ అందించిన కార్డియాలజిస్ట్… ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని నాతో చెప్పారు.

నన్ను ఈ ప్రమాదం నుండి బయటపడేసిన చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరో పోస్ట్ లో అన్ని విషయాలు వివరిస్తాను. ఈ పోస్ట్ ద్వారా…నేను ఆరోగ్యంగా ఉన్నానని నా శ్రేయోభిలాషులకు అభిమానులకు తెలుపాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకేం పర్లేదు. గతంలో మాదిరి నేను సాధారణ జీవితం గడపవచ్చు’ అంటూ సుస్మితాసేన్ వెల్లడించింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus