మెగాస్టార్ ని స్టైల్ గా చూపించడంలో సక్సస్ అయిన సుస్మిత

  • November 1, 2016 / 09:33 AM IST

దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ అందరీ ప్రశంసలందుకుంది. ఇందులో మెగాస్టార్ చాలా స్టయిల్ గా కనిపించారు. ఆయన సూపర్ లుక్ వెనుక సుష్మిత హస్తం ఉంది. చిరు పెద్ద కుమార్తె జై చిరంజీవి సినిమా తర్వాత చాలా రోజులకి ఖైదీ చిత్రానికి స్టైలిష్ గా పని చేస్తున్నారు. ఈమెకు 2006 లో విష్ణు ప్రసాద్ తో పెళ్లి జరిగింది. ఇద్దరు కూతుళ్లు పుట్టడంతో ఇంటికే పరిమితమయ్యారు. చిరు రాజకీయాల్లోకి వెళ్లి తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు చిరు తన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలి.

ఈ సమయంలో వీలు చిక్కడంతో సుష్మిత కూడా స్టైలిష్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే ఆమె మంచి మార్కులు కొట్టేశారు. ఈ సంతోష సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. “నాన్న కి డ్రస్ డిజైన్ చేయడం కన్నా.. ఆయన్ను ఒప్పించడం చాలా కష్టమైన పని. పక్కా ప్రొఫిషనల్ గా వ్యవహరిస్తారు. కూతురు కదాని ఒకే చెయ్యరు. అందుకే మరింత కష్టపడాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య రామ్ చరణ్ వారధిగా ఉండి నా పనిని సులువు చేసాడు. అతనితో పాటు మా కుటుంబసభ్యులందరి సపోర్ట్ కూడా ఉంది” అని సుష్మిత వెల్లడించారు. “ఫ్యాషన్ పేరుతో ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు, కానీ స్టైల్ గా ఉండాలి. ఆ సన్నని గీతను దృష్టిలో పెట్టుకుని పని చేసాను. రిజల్ట్ సంతోషాన్ని ఇచ్చింది” అని మెగాస్టార్ పెద్ద కుమార్తె చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus