ముగిసిన స్టార్ హీరోయిన్ అయిదేళ్ళ సహజీవనం

నటించిన సినిమాల కంటే ఇచ్చిన స్టేట్ మెంట్స్ కారణంగానే ఎక్కువ పాపులర్ అయిన హీరోయిన్ స్వరభాస్కర్. అత్యద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉన్న స్వరభాస్కర్ కి సరైన కమర్షియల్ సినిమా ఇప్పటివరకూ పడలేదు. కానీ.. “వీరే ది వెడ్డింగ్” సినిమాలోని హస్త ప్రయోగం చేసుకొనే సన్నివేశం మాత్రం అమ్మడికి విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. సల్మాన్ ఖాన్, ధనుష్, మాధవన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ.. అమ్మడికి హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తన గ్లామర్ మీదకంటే నటన మీద ఎక్కువ నమ్మకం ఉన్న స్వరభాస్కర్ ఆ పాత్రలు చేసుకుంటూ వచ్చింది.

అయితే.. ప్రస్తుతం అమ్మడు మరోమారు వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఆమె గత అయిదేళ్లుగా హిమాన్షు అనే రైటర్ తో సాగిస్తున్న సహజీవనం. గత అయిదేళ్లుగా కలిసుంటున్న వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ముఖ్యంగా.. సహజీవనానికి ఒకే అన్న హిమాన్షు పెళ్లి చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేనని చెప్పడం పెద్ద సమస్యగా మారింది. దాంతో ఇద్దరూ విడిపోయి వేరు పడేందుకు సన్నద్ధ్మవుతున్నారట. ఆల్రెడీ నెల రోజుల నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు. అందుకే.. తన పి.ఆర్ టీం ద్వారా ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు వచ్చేలా చేసింది. మరి స్వరభాస్కర్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus