పసుపులో స్వాతి.. మెరిసెను మెరిసెను..
- November 22, 2016 / 12:50 PM ISTByFilmy Focus
బుల్లితెరపై నుండి సరాసరి సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది స్వాతి. తొలి సినిమా అనుభవానికే పరిమితమైన మలి సినిమాతో తొలి హిట్ కొట్టింది ఈ తెలుగమ్మాయి. ఈ ఫలితంతో తెలుగులో స్వాతికి ఒరిగింది ఏమీ లేదు గానీ అదే సంవత్సరం విడుదలైన తమిళ సినిమా ‘సుబ్రమణ్యపురం’ (తెలుగులో అనంతపురం 1980)తో తమిళ నాట స్వాతి కెరీర్ స్పీడ్ అందుకుంది.
మళ్ళీ స్వాతి తెలుగు తెరపై తళుక్కుమంది అంటే అది ‘స్వామి రారా’ సినిమాతోనే. నిఖిల్ తో రెండోసారి జతకట్టిన ‘కార్తికేయ’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా వచ్చిన అవకాశాలతో నటిగా తనను తాను నిరూపించుకున్న స్వాతి లుక్ పరంగా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ‘త్రిపుర’ సినిమాలో ఆమె ఒంటి తీరుని తప్పుబట్టని వారు లేరు. తర్వాత మరో సినిమా సైన్ చేయని స్వాతి ఫొటో ఒకటి తాజాగా నెట్టింట్లోకి వచ్చింది. ఈ ఫొటోలో పసుపు రంగు లాంగ్ టాప్ వేసుకుని సన్నబడిన లుక్ తో మెరుపుతీగలా దర్శనమిస్తోంది స్వాతి. ఈ ఫొటో మన దర్శక, నిర్మాతల కంట్లో కూడా పడితే స్వాతిని మళ్ళీ సినిమాల్లో చూసే అవకాశం లేకపోలేదు. అయితే ఆమె చేతిలో పుస్తకాలు అందుకు అనుమతిస్తాయో లేదో మరి..?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











