‘కార్తికేయ 2’ ‘స్పై’ తర్వాత నిఖిల్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు'(Swayambhu). భరత్ కృష్ణమాచారి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నభా నటేష్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో ‘పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్’ పై భువన్ అండ్ శ్రీకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా టీజర్ ను వదిలారు.
‘స్వయంభు’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 17 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఆల్మోస్ట్ ట్రైలర్ లెంగ్త్ ఉందని చెప్పొచ్చు. ‘సదాశివుడే దిగి వచ్చి శ్రీరాముడికి అందించిన సింధూరికి కూడా అరణ్యవాసమా’ అంటూ అయ్యప్ప శర్మ పాత్రతో చెప్పించిన డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఒక రాజ్యంలో అంతర్యుద్ధం చోటు చేసుకోవడం.. ఈ నేపధ్యంలో చోటు చేసుకున్న ఘోరాలు కనిపించాయి.
విలన్ మోటో ఆ సింధూరిని దక్కించుకోవడం అని మెయిన్ థీమ్ ఏంటి అన్నది హింట్ ఇచ్చారు. ‘కాలం కత్తై దూస్తే,కాపాడే కవచం ఒకటి కావాలి కదా’ ‘బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా.. కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది’ వంటి డైలాగులు బాగున్నాయి. సెంథిల్ కుమార్ విజువల్స్, రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. మొత్తంగా టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్రాండ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి: