Swetha Agarwal: వైరల్ గా మారిన హిరోయిన్ శ్వేత అగర్వాల్ ఫోటోలు..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ. కొందరే రెండు, మూడు దశాబ్దాలు ఏలేస్తారు. స్టార్ డమ్ దక్కని హీరోయిన్స్ రెండు మూడేళ్లలోనే చాప చుట్టేస్తారు. అలా చాప చుట్టేసిన వారి లిస్ట్ తీస్తే శ్వేత అగర్వాల్ ఒకరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్ శ్వేత అగర్వాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శ్వేత అగర్వాల్ ని దర్శకుడు రవిబాబు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.

నరేష్ డెబ్యూ మూవీలో అల్లరి లో శ్వేత నటించింది. తర్వాత సుదీప్ పక్కన కిచ్చ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. మూవీ హిట్ అయినా ఆమెకు కన్నడలో ఆఫర్స్ రాలేదు.మలయాళంలో ఓ మూవీ చేసింది నాలుగో చిత్రంగా ప్రభాస్ తో రాఘవేంద్ర చేసింది. ఇది ప్రభాస్ కి సెకండ్ మూవీ. రాఘవేంద్ర మూవీలో అన్షు మెయిన్ హీరోయిన్ కాగా… శ్వేత అగర్వాల్ సెకండ్ హీరోయిన్ గా చేసింది. ప్రభాస్ మరదలిగా నటించినా… శ్వేత అగర్వాల్ కి బ్రేక్ రాలేదు.

రాఘవేంద్ర మూవీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత గమ్యం మూవీ కనిపించింది. 2008లో ఓ హిందీ మూవీ చేసిన శ్వేత అగర్వాల్ చిత్ర పరిశ్రమకు దూరమైంది. 2020లో సింగర్ ఆదిత్య నారాయణ్ ని వివాహం చేసుకుంది. ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ కొడుకే ఈ ఆదిత్య నారాయణ్.

వీరికి ఒక అమ్మాయి సంతానం. పెళ్లై పిల్లలు పుట్టాక (Swetha Agarwal) శ్వేత అగర్వాల్ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు నాజూగ్గా కవ్వించిన అమ్మడు బొద్దుగా తయారైంది. ఆమె ఫొటోలు చూసిన ఫ్యాన్స్.. ప్రభాస్ హీరోయిన్ ఇంత బొద్దుగా తయారైందేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus