తమిళంలో రికార్డు సృష్టించిన ‘సైరా నరసింహారెడ్డి’

అదేంటి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ఇప్పుడు రికార్డు సృష్టించడం ఏంటి.. ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసి టీవీల్లో కూడా టెలికాస్ట్ అవ్వడానికి రెడీ గా ఉంది కదా…అనుకుంటున్నారా? అదేమీ లేదండి.. ఇటీవల ఈ చిత్రం తమిళ్ వెర్షన్ ను టీవీ ల్లో టెలికాస్ట్ చేయగా రికార్డు టి.ఆర్.పి ని నమోదు చేసింది. ‘సైరా నరసింహారెడ్డి’ తమిళ టీవీ ప్రీమియర్ కు 15.44 రికార్డు టి.ఆర్.పి నమోదు కావడం విశేషం. ఇప్పటి వరకూ తెలుగు సినిమా తమిళ డబ్బింగ్ సినిమాల్లో ఎక్కువ టి.ఆర్.పి నమోదు చేసిన చిత్రం మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ 13.06 టి.ఆర్.పి. ఇప్పుడు ‘సైరా’ చిత్రం ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.

పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ‘సైరా’.. కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో సాధించలేక ప్లాప్ గా మిగిలింది. తమిళంలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే టీవీ ల్లో మాత్రం మంచి టి.ఆర్.పి నే నమోదు చేసింది. విజయ్ సేతుపతి, నయన తార వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో ఉండడంతో ఇంత రికార్డు టి.ఆర్. పి సాధ్యమైందని చెప్పాలి. ఇక తమిళ వెర్షన్ లో ఎక్కువ టి.ఆర్. పి నమోదు చేసిన తెలుగు సినిమాలు ఇవే :

1) సైరా నరసింహారెడ్డి : 15.44 టి.ఆర్.పి

2) 1 నేనొక్కడినే : 13.06 టి.ఆర్.పి

3) స్పైడర్ : 10.40 టి.ఆర్.పి

4) బాహుబలి 2 : 10.33 టి.ఆర్.పి

5) బాహుబలి : 8.66 టి.ఆర్.పి

6) భరత్ అనే నేను : 3.54 టి.ఆర్.పి

7) వినయ విధేయ రామా : 2.64 టి.ఆర్.పి

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus