అక్కడ ‘స్పైడర్’ ‘సాహో’ లని కూడా బీట్ చేయలేకపోయిన ‘సైరా’..!

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లయిమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకి హైలెట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ‘ది బెస్ట్’ అని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది అనడంలో మాత్రం సందేహం లేదు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం ‘ప్రీమియర్స్’ ఆశించిన స్థాయిలో రాలేదు.

‘సైరా’ కేవలం $857K మాత్రమే కలెక్ట్ చేసి ‘ఆల్ టైం టాప్ 7’ గా నిలిచింది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ప్రీమియర్స్ కే $1.3 మిలియన్ రాబట్టి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. మరి ‘సైరా’ కి ఇంత పాజిటివ్ టాక్, రివ్యూలు వచ్చి ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఎందుకు వచ్చాయి అనేది అర్ధం కాని ప్రశ్న. కనీసం మహేష్ డిజాస్టర్ సినిమా ‘స్పైడర్’.. ప్రభాస్ ‘సాహో’ చిత్రాల ప్రీమియర్స్ కూడా ‘సైరా’ రాబట్టలేకపోయింది. ఇప్పటి వరకూ టాప్ 10 ప్రీమియర్స్ ను సాధించిన సినిమాల లిస్ట్ ఇలా ఉంది :

1) బాహుబలి 2 : $ 2.45 మిలియన్

2) అజ్ఞాతవాసి : $1.52 మిలియన్

3) బాహుబలి ది బిగినింగ్ : $1.36 మిలియన్

4) ఖైదీ నెంబర్ 150 : $1.29 మిలియన్

5) స్పైడర్ : 1.003 మిలియన్

6) సాహో : $915 K

7) సైరా నరసింహారెడ్డి :$857K

8) భరత్ అనే నేను : $850K

9) అరవింద సమేత : $798K

10) రంగస్థలం : $725K

‘సైరా’ సినిమా రివ్యూ & రేటింగ్!
వార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus