సినిమా ఎంత భారీ బడ్జెట్ తో, ఎంత అత్యద్భుతమైన క్యాస్టింగ్ తో తీసినా.. ప్రమోషన్స్ అనేవి సరిగా లేకపోతే ఉపయోగం ఉండదు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయ్యింది. “బాహుబలి” సినిమాని ట్రేడ్ ఎనలిస్ట్స్ ఇప్పటికీ మార్కెటింగ్ మార్వెల్ అని పేర్కొంటుంటారు. అందుకు కారణం రాజమౌళి & టీం ఆ సినిమా ప్రమోషన్స్ ను నిర్వహించిన తీరు. పబ్లిక్ ఈవెంట్స్ కాకుండా చాలా పాపులర్ యూట్యూబ్ చానల్స్ & ఫిలిమ్ క్రిటిక్స్ కి కూడా బాహుబలి టీం సీక్రెట్ గా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సరిగ్గా విడుదలకు వారం ముందు ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన సదరు ఇంటర్వ్యూలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి.
ఇప్పుడు “సైరా నరసింహా రెడ్డి” టీం కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతోంది. ఆల్రెడీ బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ కు చెందిన పాపులర్ మీడియా హౌజ్ లకు, క్రిటిక్స్ కు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు చిరు. ఇదంతా చాలా సైలెంట్ గా చిరంజీవి ఇంట్లో జరిగిపోతోంది. అవన్నీ రేపటితో పూర్తవుతాయి. అనంతరం తెలుగులో ప్రమోషన్స్ మొదలవుతాయి. మరో మూడు ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలవుతున్న “సైరా నరసింహారెడ్డి”ని బ్లాక్ బస్టర్ గా మలచాలన్నదే టీం ఎఫెర్ట్.
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి