కన్నడ చిత్రసీమ నుండి వచ్చిన “కె.జి.ఎఫ్” చిత్రానికి విడుదలరోజు వరకూ కనీస స్థాయి పబ్లిసిటీ లేదు. విడుదలరోజు వచ్చిన రివ్యూలు మరియు పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ ఆడియన్స్ కి ఈ చిత్రం భీభత్సంగా నచ్చేయడం వలన అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం భారీ స్థాయి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు “సైరా” పొజిషన్ కూడా అలాగే ఉంది.
సరైన పబ్లిసిటీ & ప్లానింగ్ లేకపోవడం వలన హిందీలో సైరా ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చాయి. ముఖ్యంగా.. “వార్, జోకర్” సినిమాలు సైరాకు నార్త్ బెస్ట్ లో గట్టి పోటీ ఇచ్చాయి. అయితే.. వార్ కు ఊహించిన స్థాయిలో పాజిటివ్ బజ్ రాలేదు. అలాగే.. “జోకర్”కు విశేషమైన స్పందన వచ్చినప్పటికీ.. అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదది. దాంతో.. సైరాకీ వస్తున్న పాజిటివ్ టాక్ తో, వచ్చేవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు కాబట్టి లాంగ్ రన్ లో మరీ భీభత్సంగా కాకపోయినా.. చెప్పుకోదగ్గ స్థాయి కలెక్షన్స్ ను సైరా సాధించడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!