Taapsee: స్టార్ హీరోలపై తాప్సి కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు తెలుగులో గ్లామర్ హీరోయిన్ గా నటించి తాప్సి ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. స్టార్ హీరోలు లేకుండా తాప్సి నటించిన సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరినవి చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ దక్షిణాదిన ‘జనగణమన’, ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. హిందీలో ఆమె నటిస్తున్న సినిమాలన్నీ లేడీ ఓరియెంటెడ్ కథలే. ఈ సినిమాల్లో ‘రష్మీ రాకెట్’ సినిమా ఈ నెల 15న జీ5లో విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది తాప్సి. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మొదటినుంచి కూడా హీరోయిన్లకు ప్రాముఖ్యత లేని పాత్రలో ఇస్తూ వచ్చారని.. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగిందని.. కానీ ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయని అంది. అయితే ఇలాంటి సినిమాల్లో నటించడానికి హీరోలు ఒప్పుకోరని కామెంట్స్ చేసింది. వాళ్ల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత లేదని తెలిసినా నటిస్తామని..

కానీ వాళ్లు మాత్రం ఒప్పుకోరని.. ముఖ్యంగా పెద్ద హీరోలెవరూ కూడా తనతో నటించడానికి ఇష్టపడడం లేదని చెప్పింది. గతంలో తనతో నటించిన ఓ హీరో కూడా ఇటీవల నో చెప్పాడని నిర్మొహమాటంగా వెల్లడించింది తాప్సి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారింది. ‘లూప్ లపేటా’, ‘దొబారా’, ‘ఏలియన్’, ‘శభాష్ మిథూ’, ‘బ్లర్‌‌’ ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus