కంగనా, రంగోలీ ట్వీట్స్ పై స్పందించిన తాప్సీ

“సాధారణంగా ఎవరైనా మనల్ని తిడుతున్నారంటే మనకి కోపం రావాలి, అందుకోసం బీపీ పెరగాలి.. అంటే మన రక్తం కోపంతో మరగాలి. కానీ.. అసలు నన్ను డైరెక్ట్ గా ఎదుర్కొనే కనీస స్థాయి ధైర్యం లేక సోషల్ మీడియాలో నాపై అనవసరమైన ట్రోల్స్ చేసేవాళ్ల గురించి నేను పట్టించుకోవడమే వేస్ట్.. ఇక వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్లపై కోప్పడడం అనేది అప్రస్తుతం. కాకపోతే.. అలా వాళ్ళు తిడుతుంటే నేను మాత్రం తెగ నవ్వుకుంటాను” కంగనా & రంగోలీ సిస్టర్స్ తనపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చేసే ట్రోల్స్ కు చాలా పాజిటివ్ గా స్పందించింది తాప్సీ.

Taapsee Pannu Kangana Ranaut Rangoli

తాప్సీ నటించిన తాజా చిత్రం “తప్పడ్” త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తాప్సీ అసలు కంగనాను తాను పట్టించుకోనని, ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ దృష్టిసారిస్తున్నానని, తెలుగు, తమిళ భాషల్లో మంచి సినిమాలు వస్తే చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని, అయితే.. ఈమధ్యకాలంలో అంత ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్ అక్కడి నుంచి రావడం లేదని చెప్పుకొచ్చింది తాప్సీ.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus