దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గారు పరిచయం చేసిన ఏ హీరో అయినా… హీరోయిన్ అయినా టాప్ రేంజ్ కు వెళ్తుంది అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉంది. ఆ సెంటిమెంట్ ఎంతమంది విషయాల్లో నిజమైందో తెలీదు కానీ.. తాప్సి విషయంలో మాత్రం కచ్చితంగా నిజమైందని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభంలో కొంచెం తడబడినప్పటికీ.. తరువాత కథకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈమె వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ హిట్లు మీద హిట్లందుకుంటుంది.
తాజాగా ఈమె ‘తప్పడ్’ అనే చిత్రం చేస్తుంది. అనుభవ సిన్హా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తాప్సి గృహిణిగా కనిపించబోతుంది. ఈ చిత్రంలో తాప్సి భర్తగా పవైల్ గులాటి నటిస్తున్నాడు. అయితే ఓ కీలక సన్నివేశంలో భాగంగా .. పవైల్.. తాప్సి చెంప పై కొట్టాల్సి ఉందట. కానీ అతను టెన్షన్ పడుతూ సరిగ్గా ఆ సన్నివేశం చేయలేకపోతున్నాడట. ఒకసారి ముక్కు పై, మరొకసారి చెవి పై అలా ఏడు సార్లు తాప్సి ని కొట్టాడట. చివరికి తాప్సి గట్టిగా చెప్పడంతో సరిగ్గా కొట్టాడని.. అలా ఆ షాట్ పూర్తయ్యిందని తాప్సి ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.