దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు పరిచయం చేసిన ఏ హీరోయిన్ అయినయినా తరువాత మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటుందనే సెంటిమెంట్ ఎప్పటినుండో ఉంది. చాలా వరకూ ఇది నిజమైంది కూడా. అలా దర్శకేంద్రుడి సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో తాప్సి ఒకరు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసి పలు హిట్లందుకున్నప్పటికీ కుర్ర హీరోయిన్లు ఎక్కువవ్వడంతో నిలదొక్కుకోలేకపోయింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం వరుసగా కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తూ వరుస హిట్లందుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల.. కరీనా కపూర్ ‘వాట్ ఉమెన్ వాంట్-2’ షోలో తాప్సీ పాల్గొంది.
ఈ షోలో గతంలో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చింది. అదేంటంటే.. గతంలో ఓసారి తాప్సీ గురుద్వారా దగ్గరకు వెళ్ళిందట. అయితే అక్కడ ఓ వ్యక్తి ఆమెను అశ్లీలంగా తాకే ప్రయత్నం చేశాడట. గురుద్వారా ముందు ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుందని ఆమె తెలిపింది. తాప్సి మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో గురుద్వారా ముందు జనాలతో ఎంతో రద్దీగా ఉంది. అలాంటప్పుడు ఒకరికి ఒకరు తగులుకోవడం సహజం. అది ముందుగానే నాకు తెలుసు. అయితే ఒక యువకుడు నా బ్యాక్ సైడ్‌ను తాకే ప్రయత్నం చేసాడు. వెంటనే అది నేను గుర్తించాను. నా బ్యాక్‌ను ఎవో టచ్ చేశారని అనిపించగానే… అతని చేతికున్న వేలుని గట్టిగా పట్టుకుని విరకొట్టాను. అంతే.. అతను అక్కడి నుంచి పారిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది.