ఒక్కోసారి సినిమా వాళ్ల డ్రెస్‌లు, యాక్సెసరీల ధర చూస్తే.. ఇంతేసి డబ్బులు పోసి ఎందుకు కొంటారబ్బా అనిపిస్తుంది. చిన్నపాటి బ్యాగు, మామూలు డ్రెస్, వాచ్, షూస్.. ఇలా ఏది తీసుకున్నా రేటు మామూలుగా ఉండదు. స్టార్లు ఏదైనా ఈవెంట్‌కి వచ్చినప్పుడు, ఎయిర్పోర్ట్ లుక్‌లో కనిపించినప్పుడు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. తాజాగా తమన్నా కూడా ఇలాంటి ఓ కాస్ట్లీ యాక్సెసరీతో కనిపించింది. దీంతో ఆ వస్తువు ధర ఎంత అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. రేటు చూసేసరికి వామ్మో అంత రేటా అనుకోవడం మొదలుపెట్టారు.
హీరోల విషయంలో మహా అయితే టీషర్ట్, వాచ్, షూస్ మాత్రం ఉంటాయి. అదే హీరోయిన్ల దగ్గరకు వచ్చేసరికి టాప్ టు బాటమ్ పరిశీలిస్తుంటారు. అలా తమన్నా చేతిలో ఇటీవల కనిపించిన ఓ బ్యాగు గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. తమన్నా మంగళవారం ఉదయం ముంబయి ఎయిర్ పోర్టులో కనిపించింది. జీన్స్, వైట్ టీ షర్ట్, పైన కోట్తో అదిరిపోయింది తమన్నా. అయితే ఆ సమయంలో ఆమె ఓ బ్యాగ్ పట్టుకుని ఉంది. బర్ బెర్రీ బ్రాండ్‌కి చెందిన ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలట!
అవును… మీరు చదివింది నిజమే! (Tamanna) తమన్నా లక్ష రూపాయల బ్యాగును వాడుతోంది. గతంలోనూ తమన్నా ఇలా కాస్ట్లీ వస్తువులతో కనిపించింది. ఇప్పుడు కూడా అలాంటిదే. మామూలుగా అమ్మాయిలకు బ్యాగులు అంటే ఇష్టం అని చెబుతుంటారు. హీరోయిన్ కదా కాస్త కాస్ట్లీ బ్యాగు అంటే ఇష్టమవ్వొచ్చు అని కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది.
ఆ సినిమా కాకుండా హిందీలో ‘బోల్ చుడీయా’, మలయాళంలో ‘బాంద్రా’ సినిమాలు చేస్తోంది. అయితే ఆమె రీసెంట్గా సినిమాల కంటే ప్రేమ కబుర్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ కన్ఫామ్ చేయడం లేదు.