ఐటెం సాంగ్ చేయట్లేదట!

గోపీచంద్ – సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. స్ర్కిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. వ‌చ్చే నెల‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈలోగా క‌థానాయిక‌ల్ని కూడా ఎంపిక చేసేసుకొన్నారు. హ‌న్సిక‌, కేథ‌రిన్ ఇప్ప‌టికే క‌థానాయిక‌లుగా ఫిక్స్ అయ్యారు. ఓ ప్ర‌త్యేక గీతం కోసం త‌మ‌న్నాని ట్రై చేస్తున్నార‌ని, స్పెష‌ల్ సాంగ్ కోసం త‌మ‌న్నాకు రూ.50 ల‌క్ష‌ల పారితోషికం ఆఫ‌ర్ చేశార‌ని వార్త‌లు వినిపించాయి. సంప‌త్ నందికి త‌మ‌న్నా అంటే సెంటిమెంట్‌.

ర‌చ్చ‌, బెంగాల్ టైగ‌ర్‌ల‌లో త‌మ‌న్నానే క‌థానాయిక‌గా న‌టించింది. ఆ సెంటిమెంట్ తోనే సంప‌త్ నంది.. త‌మ‌న్నా కోసం ఐటెమ్ సాంగ్ సెట్ చేశార‌ని చెప్పుకొన్నారు. అయితే చిత్ర‌బృందం మాత్రం ఈ విష‌యాన్ని ఖండించింది. త‌మన్నా ని పాట కోసం ఎంపిక చేసుకొన్నామ‌న్న మాట లో వాస్త‌వం లేద‌ని, అదంతా గాసిప్ అని చెబుతున్నారు. ఐటెమ్ సాంగ్ అనే ఆలోచ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేద‌ట‌. సో… త‌మ‌న్నా ఎంట్రీ అనేది గాసిప్పే అన్న‌మాట‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus