పెళ్లి వార్తలను ఖండించిన తమన్నా..!

తనకు పెళ్లి కుదిరిందని వస్తున్న వార్తలను మిల్కీ బ్యూటీ తమన్నా ఖండించింది. తనకు పెళ్లి కుదరలేదని .. ప్రస్తుతం తన దృష్టి మొత్తం నటనపైనే అని చెప్పుకొచ్చింది. ‘ ప్రస్తుతం నేను ప్రభుదేవా సరసన అభినేత్రి చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంతో పాటు పలు దక్షిణాది భాషల్లో తెరకెక్కనున్న చిత్రాల్లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాను.

నేను పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేద’ని తెలిపింది. కాగా తమన్నా ఓ సాఫ్ట్ వేర్ ను వివాహమాడనుందని, ఈ వివాహం తరువాత తమన్నా చిత్రాల నుంచి తప్పుకోనుందని వచ్చిన వార్తలపై తమన్నా పై విధంగా స్పందించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus