నారా రోహిత్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యాడు. సహా నటి శిరీష్..ను(సిరిలెల్ల) అతను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.2 రోజుల క్రితం హైదరాబాద్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు వీరి పెళ్ళికి హాజరై తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పెద్దలుగా వ్యవహరించి రోహిత్ పెళ్లి చేశారు.
అలాగే లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ, తేజస్విని వంటి వారు కూడా రోహిత్ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీవిష్ణు వంటి హీరోలు కూడా సందడి చేశారు. ఇక పెళ్ళైన తర్వాత నారా రోహిత్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
నారా రోహిత్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. “మీ బ్లెస్సింగ్స్ తో మా డే ఇంకా స్పెషల్ గా మారింది. మా జీవితాల్లో కొత్త వెలుగు నింపినట్టు కూడా అయ్యింది. ఇందుకు కారణమైన నా బంధువులు, స్నేహితులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించిన, చూపిస్తున్న ఈ ప్రేమ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాము.
పెద్దమ్మ, పెదనాన్న, లోకేష్, బ్రాహ్మణి వదిన, మామ, తేజస్విని, వసుందర అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.మమ్మల్ని ప్రత్యేకంగా దీవించిన సినీ ,రాజకీయ ప్రముఖులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పటికీ మరువలేనిది. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే స్నేహితులందరికీ కూడా మీ హార్ట్ ఫుల్ విషెస్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను” అంటూ పేర్కొన్నాడు. అతని పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.