తమన్నా కెరీర్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ‘శ్రీ’ సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత ‘హ్యాపీ డేస్’ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్సులు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్లో చెప్పుకోదగిన పెర్ఫార్మన్స్ లేకపోయినా గ్లామర్ తోనే ఈ అమ్మడు దాదాపు 2 దశాబ్దాల వరకు నెట్టుకొచ్చింది.
ఇప్పుడు కొత్త భామల పోటీతో అవకాశాలు రావడం కష్టం. అందుకే ఓ పక్క స్పెషల్ సాంగ్స్ వంటివి చేస్తూనే మరోపక్క బోల్డ్ సిరీస్..లలో కూడా తన నటిస్తూ తన మార్కెట్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గ్లామర్ డోస్ మరింతగా పెంచనుంది అని తెలుస్తుంది.
విషయంలోకి వెళితే.. తమన్నా ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ అనే సీక్వెల్ కి ఓకే చెప్పినట్టు సమాచారం.ఆల్మోస్ట్ అడల్ట్ కంటెంట్ సినిమాల ఫ్రాంచైజీ ఇది. గ్లామర్ డోస్ ముఖ్యంగా పడక గది సన్నివేశాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి కంటెంట్ సినిమాలో తమన్నా నటించడానికి ఒప్పుకుంది. ఏక్తా కపూర్ రూపొందించనున్న ఈ సినిమాలో తమన్నా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ సీన్స్ లో నటించనుంది అని సమాచారం. అందుకు గాను ఏకంగా రూ.10 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ‘రాగిణి ఎం ఎం ఎస్ పార్ట్ 2’ లో సన్నిలియోన్ నటించింది. నెక్స్ట్ పార్ట్ లో ఆమె ప్లేస్ లో తమన్నా కనిపించనుందన్న మాట. ‘లస్ట్ స్టోరీస్ 2’ కే తమన్నా పై విమర్శల వర్షం కురిసింది. మరి ‘రాగిణి ఎం ఎం ఎస్’ సీక్వెల్ లో తమన్నాని చూశాక నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.