Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ‘జాంబీ రెడ్డి’ ‘హనుమాన్’ వంటి సినిమాలు వచ్చాయి. ఇవి 2 కూడా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు సూపర్ హిట్ అయ్యాయి. ‘జాంబీ రెడ్డి’ కోవిడ్ టైంలో రిలీజ్ అయ్యింది. కోవిడ్ టైంలో ప్రజలు బాగా భయపడ్డారు. అందువల్ల ‘జాంబీ రెడ్డి’ కాన్సెప్ట్ తో బాగా రిలేట్ అయ్యారు. అలా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Zombie Reddy 2

అటు తర్వాత ‘హనుమాన్’ వచ్చింది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం టైం చూసుకుని ఈ సినిమాని రిలీజ్ చేశారు. అందువల్ల ఈ సినిమాకి కూడా బాగా రిలేట్ అయ్యారు ఆడియన్స్. ఫలితంగా సినిమా ‘జాంబీ రెడ్డి’ కంటే కూడా 10 రెట్లు కలెక్ట్ చేసి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ‘జాంబీ రెడ్డి’ కి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ ఎవరికి వాళ్ళు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సీక్వెల్ డిలే అవుతూ వచ్చింది. మొత్తానికి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ క్రేజీ సీక్వెల్ ను టేకప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తేజ సజ్జతో ‘మిరాయ్’ అనే సినిమాని నిర్మిస్తుంది ఈ సంస్థే. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. ఆ వెంటనే తేజ సజ్జతో మరో సినిమా చేయడానికి ఈ సంస్థ రెడీ అయ్యింది. అందులో భాగంగానే ‘జాంబీ రెడ్డి 2’ ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది యుగాంతం కాన్సెప్ట్ తో రూపొందే సినిమా అని టాక్ నడుస్తుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం చేయడం లేదు. కథ, స్క్రీన్ ప్లే మాత్రమే అందిస్తున్నారు. దర్శకుడు ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus