సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఓ జ్యువెలరీ బ్రాండ్‌ను ఏర్పాటు చేసి షాకిచ్చింది తమన్నా. అలాంటి ఆమె ఇప్పుడు కెరీర్ దాదాపు చివరి దశలో ఉన్నప్పుడు జువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించడం పెద్ద విషయం అనిపించదు. ఏంటీ తమన్నా ఇప్పటికే ఓ బ్రాండ్ ప్రారంభించిందా? ఎప్పుడు అనుకుంటున్నారా? అవును, చాలా ఏళ్ల క్రితమే ఆ బ్రాండ్ స్టార్ట్ చేసింది. అయితే ఏమైందో ఏమో కొన్నేళ్లు నడిపించిన తర్వాత దాని ఊసే లేదు. ఇప్పుడు తమన్నా ఫైన్ జువెలరీ అని కొత్త బ్రాండ్ స్టార్ట్ చేసింది.
ముంబైలోని జుహులో తమన్నా ఫైన్ జ్యువెలరీకి చెందిన ఫ్లాగ్ షిప్ స్టోర్‌ను ఇటీవల ప్రారంభించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లోనూ ధరించేలా నగలు డిజైన్ చేశారు. వీటిని స్వయంగా తమన్నానే డిజైన్ చేసిందట. తన తండ్రి 15 ఏళ్లుగా జ్యువెలరీ వ్యాపారంలో ఉన్నారని, ఆ అనుభవంతోనే ఈ స్టోర్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో ధరించేలా అంటున్నారు కానీ ధర మాత్రం భారీగానే ఉంటుంది అని చెబుతున్నారు.
ఇక ఇప్పుడు తమన్నా షోరూమ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. సమంత, మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, ఫాతిమా సనా ఖాన్ లాంటి స్టార్ హీరోయిన్స్ సందడి చేశారు. వీరందినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇదంతా ఓకే కానీ తమన్నా తొలి బ్రాండ్ ఏంటి అనేగా మీ ప్రశ్న. తమన్నా ఫస్ట్ టైమ్ తీసుకొచ్చిన బ్రాండ్ నేమ్ వైట్ అండ్ గోల్డ్. ఈ పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా పెట్టారు.
ఈ బ్రాండ్ ఇప్పటికీ ఉంది. అయితే తొలి నాళ్లలా తమన్నా కానీ, ఆమె టీమ్ కానీ ఈ బ్రాండ్ గురించి ప్పుడు ఎక్కడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. అలా ఇప్పుడు ఆమె ప్రారంభించింది రెండో బ్రాండ్.