అక్కినేని కుటుంబం నెక్స్ట్‌ అన్నీ తమిళ దర్శకులతోనే!

  • October 19, 2022 / 01:43 AM IST

అక్కినేని హీరోలు హిట్‌ సినిమాల కోసం తమిళ దర్శకుల్ని నమ్ముకున్నారా? ఏమో వాళ్ల నెక్స్ట్‌ సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. కావాలంటే చూడండి… అక్కినేని నాగార్జున, నాగచైతన్య.. ఇప్పుడు అఖిల్‌ ముగ్గురికి ముగ్గురూ తమ నెక్స్ట్‌ సినిమాలను తమిళ దర్శకుల చేతుల్లోనే పెట్టారు, పెడుతున్నారు కూడా. ఇప్పటికే మొదటి ఇద్దరి గురించి క్లారిటీ రాగా, మూడో హీరోగా గురించి లేటెస్ట్‌గా పుకార్లు వస్తున్నాయి. ముందుగా మూడో హీరో అఖిల్‌ సినిమా గురించి చూద్దాం.

సురేందర్‌ రెడ్డితో చాలా రోజులుగా ‘ఏజెంట్‌’ చేస్తున్న అఖిల్‌.. తన తర్వాతి సినిమాను ఓ తమిళ దర్శకుడికి చేస్తున్నారని టాక్‌ వస్తోంది. అతనే పి.ఎస్‌.మిత్రన్‌. ఈ దీపావళికి కార్తిని ‘సర్దార్‌’గా చూపించబోతున్నాడు. అంతకుముందు విశాల్‌ని ‘డిటెక్టివ్‌’ చేసింది కూడా ఈయనే. ఇప్పుడు తన నెక్స్ట్‌ మూవీ.. అఖిల్‌కి అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని టాక్‌. ఇక మిగిలిన ఇద్దరు హీరోల గురించి చూస్తే.. నాగార్జున తన వందో సినిమాను మోహన్‌రాజాకు చేస్తారు అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

వివిధ ఇంటర్వ్యూలో మోహన్‌రాజా, ఎన్వీప్రసాద్‌.. ఇలా కొంతమంది దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా కోసం కంటిన్యూస్‌గా పని చేసిన మోహన్‌రాజా.. ఇప్పుడు రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారు. త్వరలోనే తిరిగి హైదరాబాద్‌ వచ్చి నాగార్జున సినిమా పనులు మొదలుపెడతారట. ఇక నాగచైతన్య — వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పోలీసు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘302’ అనే పేరు అనుకుంటున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి కర్ణాటకలో చిత్రీకరణ ఇటీవల మొదలుపెట్టారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్‌ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలా ముగ్గురు అక్కినేని హీరోలు తమిళ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. అక్కినేని హీరోలకు తమిళ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ బాగా కలిసొస్తుంటారు. ఇప్పుడు ఈ తమిళ దర్శకులు ఏం చేస్తారో చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus