LEO Movie: రజనీకంత్ ఒకలా… విజయ్‌కి ఇంకోలా… ఎందుకిలా చేస్తున్నారో?

  • October 19, 2023 / 02:42 PM IST

సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండింటినీ విడదీయలేం అనే విషయం మీకు తెలిసిందే. అంతేకాదు ఈ విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. సినిమా వాళ్లు రాజకీయ నాయకుల్ని అభిమానించడం లేదంటే కోపగించుకోవడం చూసుంటాం. మరోవైపు రాజకీయ నాయకులు సినిమా వాళ్లను అభిమానించడం, కోప్పడటం చూసుంటారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు… దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది అని చెప్పొచ్చు. ‘లియో’ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులో జరుగుతున్న అంశాలే దీనికి నిదర్శనం అని చెప్పొచ్చు.

విజయ్‌ – లోకేశ్‌ కగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లియో’. ఈ సినిమాకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల విజయ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించలేదు. ఆ తర్వాత అదనపు షోలకు కూడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత టీమ్‌ మాట్లాడి అంతా సెట్‌ చేసింది అన్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కూడా అదనపు షోస్‌కి ఓకే చెప్పింది. అయితే మళ్లీ ఇప్పుడు పరిస్థితి మారింది.

తెల్లవారుజాము 4 గంటల షోలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ జీవో రద్దు చేసింది. ఉదయం 9 గంటల కంటే ముందు సినిమా వేయకూడదని మరో జీవోతో స్పష్టం చేసింది. అంతేకాదు టికెట్‌ ధరల విషయంలో పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించింది అని సమాచారం. ఎలా చేస్తారు అనే డౌట్‌ వస్తే… ‘వకీల్‌సాబ్‌’, ‘భీమ్లా నాయక్‌’ సినిమాలు గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ సినిమాల సమయంలో రెవెన్యూ అధికారులు థియేటర్ల దగ్గర ఉండి మరీ చూసుకున్నారు.

ఇప్పుడు ‘లియో’ (LEO Movie) సినిమాకు కూడా అదే చేస్తున్నారట. దీంతో విజయ్‌ సినిమాకు ఎందుకిలా అనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు మొన్నీమధ్య వచ్చిన ‘జైలర్‌’ సినిమాలకు ఇలా ఎందుకు చేయలేదు, పక్కాగా ఎందుకు ఉండలేదు అనే ప్రశ్న వస్తోంది. వెనుక కారణాలేంటో తెలియదు కానీ… విజయ్‌ సినిమా మాత్రం పొలిటికల్‌ పవర్‌ వల్ల పలుచబడుతోంది అంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags