మీడియా మీద విరుచుకుపడడం కామన్ అయిపోయింది

“తెలియక ప్రెస్ మీట్లు పెట్టారు, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది. మీకు అన్నీ వివరించాల్సిన అవసరం లేదు” అంటూ ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ మీడియా మీద ఫైర్ అయ్యారు. అసలు ఈ గొడవ మొదలైందే మా అసోసియేషన్ సొమ్ము దుర్వినియోగం అవుతుంది అంటూ నరేష్ మీడియాకి ఎక్కడం వల్ల, ఆ తర్వాత శివాజీరాజా మరో ప్రెస్ మీట్ పెట్టి “ప్రూవ్ చేస్తే రాజీనామా చేస్తాం” అంటూ మరో గట్టి స్టేట్ మెంట్ ఇవ్వడం వల్ల. గత కొన్ని రోజులుగా ఈ స్టేట్ మెంట్లు, ప్రెస్ మీట్ల పుణ్యమా అని మొదలైన చర్చకు తెరదింపడం కోసం ఇవాళ ఉదయం ఫిలిమ్ ఛాంబర్ లో తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలో మరో ప్రెస్ మీట్ పెట్టారు. గొడవ వెనుక ఉన్న కారణాలు గట్రా ఏమీ చెప్పకుండా సింపుల్ గా “మా సమస్యలన్నీ తీరిపోయాయి, మేం కలిసిపోయామ్” అనే రెండు మాటలు చెప్పేసి మీటింగ్ అయిపోయింది అంటూ లేవబోయారు. అదేంటి అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు తమ్మారెడ్డి భరద్వాజ.

నిజంగానే ఈమాత్రం దానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సింపుల్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా సరిపోతుంది కదా. మరి అంతోటి దానికి మాలో చాలా తప్పులున్నాయి అవన్నీ బయటకి చెప్పుకోలేం అని బాహాటంగా చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు. అయినా.. ప్రతిసారి మీడియాని తిట్టడం, సందు దొరికినప్పుడల్లా రిపోర్టర్లని తిట్టడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. మీడియా ప్రాముఖ్యత తెలియనివాళ్లు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే సరే కానీ.. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీ పర్సన్ కూడా ఇలా బిహేవ్ చేయడం అనేది బాధాకరం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus