Tanikella Bharani: చెప్పుతో కొట్టడానికి ఆడవాళ్ళు కూడా వచ్చారంట..!

  • August 7, 2023 / 06:49 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న ..స్టార్ నటులు ఉన్న.. తనికెళ్ళ భరణికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిన్న – పెద్ద – ఎంగేజ్ – ముసలి వయసులో ఉన్న అందర్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఆయన నటన . దాదాపు 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తనికెళ్ల భరణి.. రైటర్గా తన సినీ ప్రస్ధానాన్ని మొదలుపెట్టారు .

ఆయన రచయిత గా చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు పాత్రకు జీవం పోసి నటించడం ఆయనలోని స్పెషాలిటీ . దర్శకుడిగా – రచయితగా ఉన్న సినిమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు తనికెళ్ల భరణి . ముఖ్యంగా కెరియర్ మొదట్లో ఆయన పాత్రలు చేసి భయంకరమైన లుక్స్ లో మెప్పించారు . అంతేకాదు తెరపై విలన్ అంటే అప్పట్లో అందరికీ తనికెళ్ల భరణి (Tanikella Bharani) గుర్తు వచ్చేవారు.

క్రూరత్వం ఆయన యాక్టింగ్ లో తాండవించేది . అంతలా పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి నటించారు . ఈ క్రమంలోనే మాతృదేవోభవ సినిమా టైంలో ఆయన విలన్ రోల్ పోషించారు . ఈ సినిమాల్లో ఓ సీన్లో హీరోయిన్ పై దారుణంగా ప్రవర్తిస్తాడు తనికెళ్ల భరణి . అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది మహిళలు ఆయన నిజంగానే అలాంటి క్యారెక్టర్ అనుకోని .. బయట ఎక్కడ కనిపించిన తిట్టేవారట..

చెప్పుతో కొట్టడానికి కూడా వచ్చేవారట . ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణినే స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. దీంతో తెరపై అంతలా లీనమైపోయి నటించి మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు తనికెళ్ల భరణి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus