పెళ్లిపై ఘాటుగా సమాధానమిచ్చిన తాప్సి!

సినీ తారలకు ఏ విషయంలోనూ అంత తేలికగా ఆవేశం రాదు. కానీ ప్రేమ , పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడు మాత్రం ఎక్కడలేని కోపాలు వస్తాయి. ఎందుకో తెలియదు కానీ తాప్సి కూడా పెళ్లి ప్రస్తావన ఎత్తగానే ఇప్పుడు మీడియా పై విరుచుకుపడింది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన తాప్సి… ప్రభాస్, రవితేజ వంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగులో బ్రేక్ రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి పేరుతెచ్చుకుంది.  ఈ బ్యూటీ ఇటీవల బాడ్మింటన్‌ స్టార్‌ మాథ్యూస్‌తో ప్రేమలో పడిందన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా తాప్సీ తన లవర్‌ మాథ్యూస్‌తో కలిసి గోవాకి వెళ్లినట్లు,  అక్కడే ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలను తాప్సి ఖండించింది.

“నా పెళ్ళికి నన్ను పిలవండి” అంటూ సెటైర్ కూడా వేసింది. కానీ ముంబైలో మాథ్యూస్‌తో కలిసి తాప్సి డిన్నర్ డేట్ కి వెళ్ళింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆమె నటించిన మన్మార్జియా సినిమా ఈ రోజు విదుదలైంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆమెను పెళ్లి గురించి అడిగితే… ఆవేశంతో ఊగిపోయింది. “ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లి చేసుకుని స్థిరపడడానికి ఇంకా టైం ఉంది. పిల్లలు కావాలని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటాను. అంతే కానీ పెళ్లికి ముందే పిల్లలను కనను” అంటూ ఘాటుగానే సమాధానం చెప్పింది.  ఆ కోపం వెనుక తన ప్రేమ విషయం తెలిసిపోయిందని బాధ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus