ఎన్టీఆర్ పై తారకరత్న కామెంట్స్.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

నందమూరి తారకరత్న.. నిన్న శివరాత్రి పర్వదినాన్న మరణించిన సంగతి తెలిసిందే. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన నిన్న మరణించడం జరిగింది.కొద్దిరోజుల క్రితం టీడీపీ పార్టీలో చేరి.. యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోయారు. మొదట కుప్పంలో ఉన్న కేసి హాస్పిటల్ లో జాయిన్ చేయగా.. తారకరత్న కండిషన్ క్రిటికల్ గా మారడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.

అక్కడి వైద్యులు తారకరత్నకు మెరుగైన చికిత్స అందించి గుండె పనితీరు బాగు పడేలా చేశారు కానీ మెదడు పనితీరుని నయం చేయలేకపోయారు. విదేశాల నుండి డాక్టర్లను రప్పించినా కూడా లాభం లేకపోయింది. తారకరత్న మరణవార్త.. టాలీవుడ్ ను విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఇదిలా ఉండగా.. తారకరత్న , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సొంత అన్నదమ్ములు కాకపోయినా, పెదనాన్న చిన్నాన్న బిడ్డలు అయినా వీళ్ళు ఎంతో అన్యోన్యంగా కలిసుంటారు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్న టైంలో ఎన్టీఆర్.. బాలయ్యకి ఫోన్ చేసి తారకరత్న కండిషన్ పై ఆరా తీశారు.

తర్వాత బెంగళూరు హాస్పిటల్ కు వెళ్లి అన్న తారకరత్నని చూసొచ్చారు. ఈ క్రమంలో తారకరత్న … ఎన్టీఆర్ గురించి చెప్పిన చివరి మాటలు వైరల్ అవుతున్నాయి. ‘ఎన్టీఆర్ నా తమ్ముడే కదా, జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడటం అనేది ఉండదు.ప్రేమగా చూడాలి అనే వాటిని నేను నమ్మను. నందమూరి బిడ్డ, నందమూరి రక్తం, నా తమ్ముడు.

ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడు. అన్నకి తమ్ముడి పై ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది’ అంటూ తారకరత్న చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ‘ఒకవేళ తారకరత్న బ్రతికొస్తే.. ఎన్టీఆర్ సినిమాల్లో ఏదో ఒకరోజు సహాయ నటుడిగా అయినా కనిపించేవాడు కదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus