హీరోగా తెలుగు తెరపై ప్రవేశించి విలన్ గా మారిన నందమూరి నటుడు తారక రత్న. ఇతను తొలి సినిమా ఒకటో నంబర్ కుర్రోడు లో లవర్ బాయ్ గా అలరించాడు. వెండి తెర మీదనే కాదు నిజ జీవితంలోనూ తాను ప్రేమించిన అమ్మాయిని భాగస్వామిగా చేసుకున్నాడు. ఈ విషయాన్ని చాలా కాలం తర్వాత తారక రత్న వెల్లడించాడు.
కాలేజీ రోజుల్లో తారక్ కి స్నేహితుల ద్వారా అలేఖ్య రెడ్డి పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ కొనసాగింది. యువ రత్న చెన్నైనుంచి హైదరాబాద్ కి వచ్చినా అలేఖ్య కు టచ్ లోనే ఉన్నాడు. ఎందుకంటే ఆమె అంటే తారక్ కి చాలా ఇష్టం. ప్రేమించాడు. ఆ విషయం మొదట్లో చెప్పలేక పోయాడు. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత వీరి మధ్య బంధం బలపడింది.
ఓ శుభ సమయంలో నందమూరి అబ్బాయి అలేఖ్యకు ప్రేమ సంగతి చెప్పాడు. ఆమెకు కూడా తారక రత్నఅంటే ప్రేమ ఉండడంతో తమ తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పింది. వారు అంగీకరించక పోవడంతో ప్రేమించిన అమ్మాయిని తారక రత్న సంఘీ టెంపుల్ లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దంపతులు ఇద్దరూ వాళ్ళ పేరెంట్స్ ఆశ్సీసులు తీసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప(నిష్కా) కలిగింది.