Trivikram: ఆ టార్గెట్ ను త్రివిక్రమ్ రీచ్ అవ్వగలరా..?

  • January 18, 2023 / 07:17 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ అప్పటినుంచి షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. ముందుగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించగా.. అది త్రివిక్రమ్ అనుకున్నట్లుగా రాలేదు. దాంతో ఆ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చేశారు. ఆ వెంటనే త్రివిక్రమ్ తల్లి ఇందిరా దేవి మరణించారు. ఆమె చనిపోయిన కొన్నిరోజులకే కృష్ణ గారు కూడా మరణించడంతో మహేష్ సినిమాకి గ్యాప్ వచ్చేసింది.

అయితే ఇప్పుడు ఫైనల్ గా సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారు. సినిమా షూటింగ్ ఇలా డిలే అవుతుండడంతో ఈ ఏడాది సినిమా రిలీజ్ ఉండదని అభిమానులు అనుకున్నారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 11న సినిమా రిలీజ్ చేయడం ఖాయమని చెబుతున్నారు నిర్మాత నాగవంశీ. దీంతో త్రివిక్రమ్ అండ్ టీమ్ ఆగస్టు రిలీజ్ టార్గెట్ పెట్టుకొనే వర్క్ చేస్తున్నారట.

తాజాగా మహేష్ బాబు కూడా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలంటూ త్రివిక్రమ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారట. అందుకే అరవై రోజుల పాటు బ్రేక్ లేకుండా షెడ్యూల్ జరిపే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు త్రివిక్రమ్. షూటింగ్ త్వరగా పూర్తి చేయమనడానికి కారణం మహేష్ బాబు, రాజమౌళితో చేయబోయే సినిమా కోసమే. ఇదొక పాన్ ఇండియా సినిమా. ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమా డిలే అవ్వడానికి కారణం మహేష్ బాబే.

ఇకపై త్రివిక్రమ్ ఈ సినిమాను టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళి సినిమా కోసం సిక్స్ ప్యాక్ వర్కవుట్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు మహేష్ బాబు. సుకుమార్ సినిమా కోసం అప్పట్లో మహేష్ సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు రాజమౌళి సినిమా కోసం ఆ లుక్ ట్రై చేయబోతున్నారు. ఈ ఏడాది చివరి నుంచి రాజమౌళి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus