వెంకీ లేదా రానాతో మూవీ చేస్తానన్న తరుణ్ భాస్కర్

‘పెళ్ళిచూపులు’ చిత్రం తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. నూతన నటీనటులు విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేశ్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరిలతో తెరకెక్కిన ఈ మూవీ  ఈరోజు (శుక్రవారం) రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తర్వాతి సినిమా గురించి వెల్లడించారు. ‘‘పెళ్లిచూపులు చిత్రం తర్వాత స్టార్ హీరోల నుంచి అభినందనలు వచ్చాయి. నాగార్జున‌గారు, మ‌హేశ్‌గారు, బన్నిగారు ఇలా చాలా మందిని క‌లిశాను. వాళ్లంద‌రూ చాలా బాగా తీశావని చెప్పడమే కాకుండా.. ఏదైనా స్టోరీ రెడీగా ఉంటే, వెంట‌నే కాల్ చేయ‌మ‌ని కూడా చెప్పారు.

కానీ నేను అప్పుడే ఓ విషయం చెప్పాను. నాకు ఇంకా టైమ్ కావాలి. నాకు ఇంకా సినిమా అర్థం కావాలి. అది అర్థమైన త‌ర్వాత త‌ప్పకుండా సినిమాలు చేస్తాన‌ని వాళ్లతో చెప్పేశాను. నా తర్వాత సినిమాకి కూడా ముందుస్టోరీ రాస్తా. త‌ర్వాత ఎవ‌రితో చేయాల‌నే దాని గురించి ఆలోచిస్తా. కొత్తవాళ్లతో చేయాలా? ఇంకెవ‌రితోనైనా చేయాలా? అనేది స్టోరీ రెడీ అయిన తర్వాతే ఆలోచిస్తా.” అని వివరించారు. అయితే సురేశ్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌లోనే సినిమా చేస్తానని స్పష్టం చేశారు. క‌థ సూట్ అయితే వెంక‌టేశ్‌ తోగానీ,  రానాతో అయినా చేస్తానని వెల్లడించారు. మరి తరుణ్ భాస్కర్ మూడో హిట్ ఎవరితో అందుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus