Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో మాయాస్త్రం టాస్క్ పై కామెంట్స్..! అసలు ఈ టాస్క్ లో ఏముందంటే.?

  • September 13, 2023 / 12:45 PM IST

బిగ్ బాస్ అంటేనే టాస్క్ లు. అందులోనూ హౌస్ మేట్స్ నిద్రలు మానుకుని, స్ట్రాటజీలు ప్లే చేస్తూ మైండ్ గేమ్ ఆడుతూ తమ ఫిజికల్ స్ట్రెంత్ ని కూడా నిరూపించుకుంటారు. అలాంటి టాస్క్ లో పెర్ఫామ్ చేస్తేనే ప్రజలు బాగా మెచ్చుకుంటారు. ఓటు వేసి వారిని ఇంట్లోనే ఉండేలా సేవ్ చేస్తారు. అయితే, ఈసారి బిగ్ బాస్ లో ప్లాన్ చేస్తున్న టాస్క్ లు అన్నీ తుస్ తుస్ గా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి వారం కాబట్టి ఎక్కువ మంది హౌస్ లో ఉంటారు కాబట్టి గ్రూప్స్ గా టాస్క్ లు డిజైన్ చేస్తుంటారు.

అయితే, ఈసారి 5 వారాల ఇమ్యూనిటీ కోసం కూడా స్టార్ మహిళ లో సుమ ఆడించే టాస్క్ పెట్టారనే కామెంట్స్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో గెలిచి సందీప్ ఇమ్యూనిటీని సాధించాడు. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ విడిపోయి ఒక పవర్ ఫుల్ టాస్క్ ఆడతారని అందరూ ఊహించారు. ఊహించినట్లుగానే మాయాస్త్రం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికోసం స్వయంగా బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఒక కథని చెప్తూ సూపర్ డూపర్ బిల్డప్ ఇచ్చాడు. కట్ చేస్తే.,

ఈ టాస్క్ లో పుల్ రాజా పుల్ అంటూ ఛాలెంజ్ ఇచ్చి అడియన్స్ కి తిక్కరేగేలా చేసాడు. ఇంతోటి రోప్ టాస్క్ లు సండే ఫన్ డే రోజు ఆడుకోవచ్చని, మాయాస్త్రం అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చి, హౌస్ మేట్స్ కి కాస్టూమ్స్ ఇచ్చి టాస్క్ ని బిస్కెట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. దీనికోసం రణధీర – మహాబలి అనే రెండు టీమ్స్ పోటీ పడుతున్నాయి. రణధీర – మహాబలి – మాయాస్త్రం అంటూ ఒక రేంజ్ లో పేర్లు పెట్టి తీరా పుల్ రాజా పుల్ అంటూ రోప్ టాస్క్ ఆడించేసరికి ఈ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.

అంతేకాదు, ఇందులో రణధీర టీమ్ మూడుసార్లు గెలిచింది. దీంతో వారికి మాయాస్త్రాన్ని సంపాదించే కీ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వారు పవర్ అస్త్రాన్ని సంపాదించి హౌస్ లో కన్ఫార్మ్ కంటెస్టెంట్స్ గా మారతారు. అంతేకాదు, వాళ్లకి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ కూడా లభిస్తాయి. మరి ఈ రెండు టీమ్స్ లో ఎవరు విన్ అవుతారు అనేది ఆసక్తికరం.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus