విజయదేవరకొండ టాక్సీవాలా సినిమా సెన్సార్ రివ్యూ ఏంటంటే?

విజయ్ దేవరకొండ, ప్రియాంక జువాల్కర్ జంటగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్, జిఏ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా టాక్సీవాలా. విడుదల విషయంలో కాస్త ఆలస్యం అయినప్పటికీ అన్ని పనులు పూర్తిచేసుకొని ఈ సినిమా నవంబర్ 17 న రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్స్ డిఫ్రెంట్ గా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలని అమాంతంగా పెంచేస్తున్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడన్న విషయం తెలిసందే.

ఇక టాక్సీవాలా సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఎప్పటినుండో రిలీజ్ విషయంలో లేట్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ టాక్ పాజిటివ్ గా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే ప్రమోషన్స్ వీడియోస్ తో, పాటలతో, టీజర్స్ తో సినిమా పైన అంచనాలు చాలా పెరిగాయి. మరి విజయ్ దేవరకొండ ప్రేక్షకుల అంచనాలను అందుకొని మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus