‘సర్దార్’ నిర్మాత ఇచ్చిన ఒక్కొక్క సిల్వర్ బాటిల్ కాస్ట్ ఎంతంటే..?

అన్నయ్య సూర్య లానే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ కార్తి.. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో నటించిన ‘సర్దార్’ మూవీ ఇటీవల ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు రాబట్టి.. ఓటీటీలోనూ సందడి చేస్తుంది.. ‘సర్దార్’ విడుదలైన కొన్ని రోజులకే సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం.. ‘మిషన్‌ కంబోడియా త్వరలో మొదలవుతుంది’.. అంటూ మేకర్స్‌ ‘సర్దార్‌ 2’ అప్‌డేట్‌‌కి సంబంధించిన వీడియో షేర్ చేయగా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సర్దార్’ మంచి విజయం సాధించడంతో.. నిర్మాత, ప్రిన్స్ పిక్చర్స్‌ అధినేత ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌, దర్శకుడు పి.ఎస్. మిత్రన్‌కు టయోటా కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.. నిర్మాత ఇప్పుడు ‘సర్దార్’ లో నటించిన లీడ్ యాక్టర్లతో పాటు ముఖ్యమైన కొంతమంది టెక్నీషియన్లకు సిల్వర్ బాటిల్స్ గిఫ్టుగా ఇచ్చారు.. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచిస్తూ.. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంఅందరినీ ఆకర్షిస్తోంది..

అన్నట్టు ఈ సిల్వర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?.. రూ. 30 వేలు.. విలువైన వాటర్ బాటిల్‌తో పాటు మంచి సందేశం కూడా ఇచ్చారంటూ నిర్మాతను యూనిట్ మెంబర్స్ అంతా అభినందిస్తున్నారు.. కార్తి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’ సీక్వెల్ ‘ఖైదీ 2’ లో నటిస్తున్నాడు. ‘విక్రమ్’ మూవీలో సూర్య రోలెక్స్‌గా కనిపించి రచ్చ రంబోలా చేస్తే.. కార్తి ఢిల్లీగా మెరిసి సందడి చేశాడు. ‘ఖైదీ’ ని మించి మరింత ఆకట్టుకునేలా కథ, కథనాలు రాసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్..

‘ఖైదీ 2’ వేరే లెవల్లో తియ్యబోతున్నాడని కోలీవుడ్ సమాచారం. తన ‘విక్రమ్’ సీక్వెల్‌లో అన్నదమ్ముళ్లు సూర్య, కార్తి కలిసి కనిపించే అవకాశముందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘ఊపిరి’ వంటి స్ట్రైట్ తెలుగు మూవీతో.. కింగ్ నాగార్జున పక్కన అలరించిన కార్తి.. మంచి కథ దొరికితే.. సరైన కాంబినేషన్ కుదిరితే మళ్లీ తెలుగులో హీరోగా చేస్తానని చెప్తున్నాడు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus