RC15.. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో మరొకరు వాకౌట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా (RC15) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, పూణే లాంటి సిటీల్లో సినిమాను చిత్రీకరించారు. ప్రస్తుతం బంద్ ఉండడం వలన సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది. మరోపక్క శంకర్ కొన్నాళ్లపాటు ‘ఇండియన్ 2’ సినిమాను డైరెక్ట్ చేస్తానని చెప్పి బ్రేక్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘RC15’ సినిమా నుంచి టెక్నీషియన్ తప్పుకున్నట్లు సమాచారం.

ఇదివరకు కూడా ఈ సినిమా విషయంలో ఇలానే జరిగింది. ముందుగా ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్లుగా రామకృష్ణ-మౌనికలను తీసుకున్నారు. చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాకి వారు పని చేశారు. ‘తలైవి’ లాంటి పాన్ ఇండియా సినిమాకి కూడా వర్క్ చేశారు. అందుకే వారిని శంకర్ సినిమా కోసం తీసుకొచ్చారు. కానీ ఏమైందో ఏమో.. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే వారు సినిమా నుంచి తప్పుకున్నారు. వారి స్థానంలో రవీందర్ రెడ్డిని తీసుకున్నారు.

ఇప్పుడు రవీందర్ కూడా సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రొడక్షన్ హౌస్ తో రవీందర్ రెడ్డికి క్రియేటివి డిఫరెన్స్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం శంషాబాద్ లోని ఓ ఏరియాలో యూనివర్సిటీ సెట్ వేస్తున్నారు. ఆ సెట్ వర్క్ పూర్తి కాకముందే నిర్మాత, ప్రొడక్షన్ డిజైనర్ ల మధ్య సమస్యలు వచ్చాయట. దాంతో రవీందర్ వాకౌట్ చేశారట.

మరి ఇప్పుడు రవీందర్ స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో తను చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నారు. మరి RC15 ఆయనకు ఎలాంటి హిట్ తీసుకొస్తుందో చూడాలి!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus