Teja Sajja: ‘గుంటూరు కారం’ తో పోల్చి మాది చిన్న సినిమా అనుకోకండి: తేజ సజ్జా

  • November 29, 2023 / 11:32 AM IST

ప్రశాంత్ వర్మ.. విభిన్న కథాంశంతో కూడుకున్న సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా ‘అ!’ మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ ఫలితం అటు.. ఇటు అయినా, మళ్ళీ ‘జాంబీ రెడ్డి’ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మొదటి మూడు సినిమాలు ఒకదానితో మరొకటి సంబంధం లేని జోనర్లో చేశాడు. నాలుగో సినిమా విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఆయన నాలుగో సినిమాగా ‘హనుమాన్’ రూపొందుతుంది.

ఇది మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్ ను వెంటనే ప్రకటించలేదు. అయితే సడన్ గా ఈరోజు ‘ఆవకాయ ఆంజనేయ’ అనే ఓ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి.. ఇదే క్రమంలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

జనవరి 12 న ‘హనుమాన్’ రిలీజ్ అవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే అదే డేట్ కి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా కూడా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం పై ‘హనుమాన్’ హీరో తేజ సజ్జని ప్రకటించగా.. ” మహేష్ బాబు గారి సినిమాకి మా సినిమా పోటీ కాదు. అలా అని మాది కూడా చిన్న సినిమా కాదు. ట్రైలర్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ‘హనుమాన్’ చిత్రాన్ని ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus