Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

‘హనుమాన్’తో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ, ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి’ సీక్వెల్‌లో కనిపించబోతున్నాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. తేజ పెట్టిన ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఈ ఊహాగానాలకు ఇప్పుడు ఆజ్యం పోసింది.’కల్కి’ నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ పుట్టినరోజు సందర్భంగా తేజ ఆమెకు విషెస్ చెబుతూ ఒక ఫోటో షేర్ చేశాడు.

Kalki 2

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ పోస్ట్ చివర్లో ‘సి యు ఇన్ K ‘ అని పెట్టడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘K’ అంటే ‘కల్కి 2’ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ హింట్‌తో తేజ ఆ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఖాయమని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. 2025 చివరిలో షూటింగ్ ప్రారంభించి, 2026 సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొణె వంటి స్టార్లతో పాటు, ఇప్పుడు తేజ సజ్జ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరితే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్తుంది అనేది కొందరి అభిప్రాయం. కాకపోతే అది తేజసజ్జకే పెద్ద అవకాశం అవుతుంది.

అయితే, ఇది కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలలో భాగంగా సరదాగా పెట్టిన పోస్టా, లేక నిజంగానే ‘కల్కి 2’ గురించిన హింటా అనేది తేలాల్సి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే తప్ప ఏదీ చెప్పలేం. కానీ, తేజ ఇచ్చిన ఈ చిన్న క్లూ మాత్రం ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus