Tejaswi: కంటెంట్ డిమాండ్ చేస్తే బోల్డ్ అయినా చేస్తాను.. తేజస్విని కామెంట్స్ వైరల్!

మహేష్ బాబు సమంత జంటగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు మరదలు పాత్రలో నటించి మెప్పించిన తేజస్విని మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పలు సినిమాలలో నటించారు.అయితే తాను చేసిన సినిమాలో తనకు గుర్తింపు రాకపోవడంతో ఈమె ఏకంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఐస్ క్రీమ్ సినిమాలో ఈమె ఎన్నో బోల్డ్ సన్నివేశాలలో నటించి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తేజస్విని పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే ఈమె హీరోయిన్ గా చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఇలా ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి మరింత పాపులారిటీ పొందారు.

ఇకపోతే తాజాగా ఈమె నటించిన కమిట్మెంట్ సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.కమిట్మెంట్ సినిమా ఎంతో బోల్డ్ గా ఉండటం వల్ల ఈ సినిమా విడుదల తరచు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన అనంతరం ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కంటెంట్ డిమాండ్ చేస్తే తాను ఎలాంటి బోల్డ్, కిస్ సన్నివేశాలలో నటించడానికి అయినా తాను సిద్ధంగా ఉంటానని వెల్లడించారు. ఇకపోతే కమిట్మెంట్ సినిమాలు పలు బోల్డ్ సన్నివేశాలలో నటించడం కోసం శ్రీనాథ్ ఇబ్బంది పడ్డారని నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇక కమిట్మెంట్ సినిమా గురించి మాట్లాడుతున్న ఈమె నిజ జీవితంలో తనని ఎవరు కమిట్మెంట్ అడగలేదని అలా అడగాలన్నా కూడా భయపడేవారు అంటూ సమాధానం చెప్పారు.ఎన్నో వివాదాలను ఎదుర్కొని ఆగస్టు 19వ తేదీ కమిట్మెంట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా తనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus