జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో ఆది తెలంగాణ యాస, భాషను కించపరిచే విధంగా డైలాగ్ లు చెప్పారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై ఇప్పటికే స్పందించిన హైపర్ ఆది ఆ స్క్రిప్ట్ తాను రాయలేదని స్కిట్ పై కొన్ని ఆరోపణలు రాగా అవి తాము కావాలని చేసినవి కాదని ఆది చెప్పుకొచ్చారు.
తమకు అన్ని ప్రాంతాల వారిపై ప్రేమ ఉందని షోలో జరిగిన దాని గురించి తాను అందరి క్షమాపణ కోరుతున్నానని హైపర్ ఆది తెలిపారు. అయితే తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధులు మాత్రం హైపర్ ఆది తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నాడని చెబుతున్నారు. ఆదికి సరైన సమయంలో బుద్ధి చెబుతామని సంస్థ ప్రతినిధులు ఆదిని హెచ్చరిస్తున్నారు. హైపర్ ఆది బహిరంగ క్షమాపణ చెప్పాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి ఆది క్షమాపణలు చెప్పాలని వాళ్లు కోరుతున్నారు. ఆది పర్సనల్ పేజీలో వీడియో పెట్టి క్షమాపణలు కోరినంత మాత్రాన వదిలిపెట్టమని సంస్థ ప్రతినిధులు ఆదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశాలు కనిపిస్తుండటం గమనార్హం. గతంలో కూడా హైపర్ ఆది చేసిన స్కిట్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?