2017 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి విజయాలను అందించింది. వైవిధ్యమైన కథలతో రూపొందిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అనూహ్య విజయం సాధించాయి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అమితుమీ కామెడీ ఎంటర్టైనర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఏ సెంటర్స్ లో భారీ కలక్షన్స్ రాబట్టింది. ఇక పక్కా తెలంగాణ చిత్రంగా తెరకెక్కిన ఫిదా సూపర్ సక్సస్ అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఈ మూవీ నైజాం ఏరియాల్లో ఊహించని వసూళ్లు రాబట్టింది. ఈ కథతో నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు.
నిన్న రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం నైజాంలో తొలి రోజు షేర్ 1 .5 కోట్లు రాబట్టింది. ఈ విజయాలు తెలంగాణ నుంచి వచ్చిన టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. గత ఏడాది పెళ్లి చూపులు ఇచ్చిన ఉత్సాహమే ఈ చిత్రాల నిర్మాణానికి స్ఫూర్తి అని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిత్రంగా వచ్చిన పెళ్లి చూపులు 40 కోట్ల షేర్ రాబట్టి తెలంగాణ చిత్రాలకు ఆయువు పోసిందని చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.