విచారణకు హాజరుకానున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!

  • March 13, 2021 / 02:00 PM IST

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా.. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ తనీష్ కు నోటీసులు అందాయి. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తనీష్ ఫైనల్స్ వరకు వెళ్లాడు కానీ విన్నర్ కాలేకపోయాడు. ఆ తరువాత పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. మాదక ద్రవ్యాల కేసు విచారిస్తున్న బెంగుళూరులోని బాణాసవాడి ఉపవిభాగం పోలీసులు తనీష్ తో పాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వీరిలో ఓ పారిశ్రామికవేత్త, సినిమా నిర్మాత కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గతంలో 2017లో డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు తనీష్ హాజరయ్యాడు. ఇప్పుడు మరోసారి ఆయన బెంగుళూరులో విచారణకు హాజరు కానుండడం గమనార్హం. బెంగుళూరు అధికారులు మొదట ఇద్దరు విదేశీ యువకులను అరెస్ట్ చేసి విచారించగా.. వారిచ్చిన సమాచారాన్ని బట్టి మస్తాన్, విక్కి మల్హోత్రా పేర్లు బయటకి వచ్చాయి. మస్తాన్ ను విచారించగా.. సినీ నిర్మాత శంకర్ గౌడ పేరు వెలుగులోకి వచ్చింది.

నిర్మాత శంకర్‌ గౌడ తన ఆఫీసులో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. ఈ క్రమంలో తనీష్ పేరు బయటకి వచ్చిందని తెలుస్తోంది. మరి విచారణలో తనీష్ ఏం చెప్తాడో చూడాలి!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus