Jani Master Case: జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

జానీ మాస్ట‌ర్ (Jani Master) పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్. ఈ న్యూస్ తో యావత్ సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు సైతం ఈ వార్తతో బాగా హర్ట్ అయ్యారు. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున జానీ మాస్టర్ కూడా తన వంతు ప్రచారం చేశాడు. రాంచరణ్ తో కూడా అతనికి సాన్నిహిత్యం ఉంది. అందుకే జానీ మాస్టర్ చేసిన పనికి వాళ్ళ అభిమానులు హర్ట్ అయినట్లు తెలుస్తుంది.

Jani Master Case

మలయాళ సినీ పరిశ్రమతో పాటు దేశం మొత్తాన్ని హేమ క‌మిటీ ఊపేస్తున్న టైంలో టాలీవుడ్లో కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం.. అందరూ సీరియస్ అయ్యేలా చేసింది. చిత్ర‌సీమ కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని తెలుస్తుంది.ఇలాంటి సమస్యలు ఏమొచ్చినా తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ సామరస్యంగా పరీష్కరిస్తూ ఉంటుంది. కానీ జానీ మాస్ట‌ర్ కేసు విషయంలో బాధితురాలు ముందుగానే పోలీసులను అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి కూడా ఛాంబ‌ర్ కూడా ఓ క‌మిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

‘హేమ కమిటీ’ వంటిది ప్రారంభించాలని తెలుగు సినీ పరిశ్రమ 3 వారాల క్రితమే ఓ నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే జానీ మాస్టర్ కేసు పై వారికి నోటీసు వెళ్లడం జరిగింది. 90 రోజుల లోపే ఈ క‌మిటీ ఓ నివేదిక స‌మ‌ర్పించే అవకాశం ఉంది.బాధితురాలి స్టేట్‌మెంట్..తో పాటు జానీ మాస్ట‌ర్ స్టేట్‌మెంట్ ఈ కమిటీ స్వీకరించడం జరిగింది. తర్వాత విచారణ చేపట్టి… సాక్షాధారాల్ని సేక‌రించే ప‌నిలో పడినట్టు తెలుస్తుంది. సాక్ష్యాధారాలను బట్టి కమిటీ నివేదికను సమర్పిస్తుంది.

దాన్ని బట్టి జానీ మాస్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది నిర్ణయిస్తారు. బాధితురాలికి అన్ని ర‌కాలుగానూ అండ‌గా నిలబడతామని ఛాంబర్ పెద్దలు తెలిపారట.ఇక జానీ మాస్ట‌ర్‌పైనే కాకుండా ఇంకా కొంతమంది పై కూడా బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని కూడా ఛాంబర్ పెద్దలు విచారించనున్నారు అని స్పష్టమవుతుంది. మరోపక్క జానీ మాస్టర్ పైనే కాకుండా ఇంకొంతమంది కొరియోగ్రాఫర్లపై కూడా కొంతమంది మహిళలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.

25 ఏళ్ళ కృష్ణబాబు గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus