71 ఎడిషన్ల జాతీయ చలన చిత్ర పురస్కారాలు ఇప్పటివరకు ఇచ్చారు. మధ్యలో కొన్నాళ్లు ఈ విభాగంలో అవార్డులు రాలేదు. ఆ విషయం అంటుంచితే 2023కిగాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. అందులో ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటకుగాను కాసర్ల శ్యామ్ పురస్కారం గెలుచుకుననారు. ఇప్పటికే నలుగురు టాలీవుడ్ రచయితలు ఉత్తమ గేయ రచయిత పురస్కార గౌరవం అందుకున్నారు. వాళ్లెవరు, వాళ్లు రాసిన ఆ పాటలేంటో చూద్దాం!
* 1974లో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని ‘తెలుగు వీర లేవరా..’ పాటకుగాను దిగ్గజ కవి శ్రీశ్రీకి ఉత్తమ గేయ రచయిత పురస్కారం దక్కింది.
* ‘రాలి పోయే పువ్వా.. నీకు రాగాలేందుకే..’ అంటూ ‘మాతృ దేవో భవ’ సినిమాలో పాట రాసిన వేటూరి సుందరరామ్మూర్తికి 1993లో బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు అందుకున్నారు.
* సుద్దాల అశోక్ తేజ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి..’ పాటకు 2003లో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గేయరచయితగా పురస్కారం ఇచ్చి గౌరవించింది. ‘ఠాగూర్’ సినిమాలోని పాట ఇది.
* ‘కొండపొలం’ సినిమాలో చంద్రబోస్ రాసిన ‘ధమ్ ధమ్ ధమ్..’ పాటను మెచ్చి 2021లో ఉత్తమ గేయ రచయిత పురస్కారాన్ని అందజేశారు.